- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరావతినే కొనసాగించాలని.. టవర్ ఎక్కిన రైతు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న నాటి నుంచి రాష్ట్రంలో నిరసనలు మిన్నంటాయి. తాజాగా మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర తెలిపారు. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు బిశ్వభూషణ్ హరిచందన్ లైన్ క్లియర్ చేశారు. దీంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. సోమవారం నేలపాడులోని రైతు పూర్ణ చంద్రరావు టవర్ దగ్గర క్రేన్‌పై ఎక్కి నిరసనకుదిగాడు.
ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు సోదరుడు పులి చిన్న ఓ మీడియాతో మాట్లాడుతూ… అమరావతి రాజధాని అవుతుందని ఓ ఎంపీ వెంట తిరిగి చాలా డబ్బులు ఖర్చుపెట్టి, భూములిచ్చి అప్పులపాలయ్యాడని..ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటన రాగానే తన సోదరుడు మనస్తాపం చెంది క్రేన్ ఎక్కి నిరసనకు దిగాడన్నారు. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం జరగాలని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే టవర్ దిగుతానని, లేకుంటే కిందికి దూకుతానని స్పష్టం చేశాడు.