- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధాన్యం కొనడం లేదని నిప్పు పెట్టేశాడు
by Shyam |
X
దిశ, దుబ్బాక : ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. చేసేదేమీ లేక ధాన్యం కుప్పకు నిప్పు పెట్టాడు. ఈ ఘటన దుబ్బాక మండల కేంద్రంలో శనివారం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన రాములు అనే రైతు తాను పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డులో ఆరబెట్టి నెల రోజులు అవుతుందన్నారు. ధాన్యం ఆరబెట్టి మ్యాచర్ వచ్చినప్పటికీ అధికారులు, మార్కెట్ యార్డ్ నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని వాపోయాడు. రాత్రనకా-పగలనకా మార్కెట్ యార్డులోనే ఉండి ఏం చేయాలో తెలియక ఆవేదనతో నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశాడు. మార్కెట్ యార్డులో రాజకీయాలు ఆపేసి ధాన్యం కోనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశాడు.
Advertisement
Next Story