- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ముచ్చటగా మూడు.. చివరకు జైలుకు
దిశ, వెబ్‌డెస్క్: ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రబుద్ధితో మూడు పెండ్లిలు చేసుకున్నాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్‌లోని సహారా ఎస్టేట్‌లో ఎడ్ల శంకరయ్య నివాసం ఉంటున్నాడు. ఇతడు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, 2011లో తొలి వివాహం చేసుకున్న శంకరయ్య మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత 2016లో మరో వివాహం చేసుకున్నాడు. అయితే, తరచూ భార్యతో గొడవ పడుతూ ఇబ్బందులకు గురి చేసేవాడు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు.
కాగా, ఇదే సమయంలో సహార రోడ్డులోనే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న మంజుల రాణితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు కూడా మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత తిరుపతి తీసుకెళ్లి పెండ్లి చేసుకున్నాడు. ఈ విషయం కాస్తా అతడి రెండో భార్యకు తెలవడంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాల్సిందిగా వనస్థలిపురం స్టేషన్‌లో శంకరయ్య పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎడ్ల శంకరయ్యను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.