కొవిడ్ 19 నిబంధన ఉల్లంఘించిన హాస్పిటల్‌పై కేసు

by vinod kumar |
కొవిడ్ 19 నిబంధన ఉల్లంఘించిన హాస్పిటల్‌పై కేసు
X

న్యూఢిల్లీ: కొవిడ్ 19 నిబంధనను ఉల్లంఘించిన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌పై ఢిల్లీ ప్రభుత్వం కేసు పెట్టింది. కరోనా వైరస్ టెస్టులను అధికారిక సాఫ్ట్‌వేర్‌లో సర్ గంగారాం హాస్పిటల్(ఎస్‌జీఆర్‌హెచ్) నమోదు చేయడం లేదని ఆరోపిస్తూ ఢిల్లీ ఆరోగ్య శాఖ డిప్యూటీ సెక్రెటరీ పోలీసు కేసు పెట్టారు. కేంద్రప్రభుత్వం అభివృద్ధి చేసిన ఆర్‌టీ-పీసీఆర్ యాప్‌లో ప్రతి ఆస్పత్రి కరోనా టెస్టుల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని ప్రభుత్వ నిబంధన ఉన్నది. దీనితో ప్రభుత్వ డేటాబేస్‌లో రియల్‌టైమ్‌లో కేసుల వివరాలు నమోదవుతాయి. దీంతో ఒకే కేసు మరోసారి లెక్కించకుండా, పారదర్శకత పాటించేందుకు వీలవుతుంది. అయితే, ఈ సాఫ్ట్‌వేర్‌లో కరోనా టెస్టుల వివరాలను జూన్ 3వ తేదీన ఎస్‌జీఆర్‌హెచ్ నమోదు చేయలేదని గుర్తించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు ఆస్పత్రిపై కేసు నమోదైంది.

కరోనా అనుమానితులను వెనక్కి పంపొద్దు: కేజ్రీవాల్

ఢిల్లీలో కరోనా పేషెంట్ల కోసం ఆస్పత్రి పడకల కొరత లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా అనుమానితులను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పంపించొద్దని ఆస్పత్రులను ఆదేశించారు. కొన్ని ఆస్పత్రులు కరోనా అనుమానితులను వెనక్కి పంపిస్తున్నాయని, బెడ్లతో బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిని వదిలిపెట్టబోరని హెచ్చరించారు. కరోనా అనుమానితులను తిప్పి పంపించే ఆస్పత్రులపై దర్యాప్తు జరపుతామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed