- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తవ్వకాల్లో బయటపడ్డ 3వేల ఏళ్ళ నాటి నగరం.. ఎక్కడో తెలుసా..?
దిశ, వెబ్డెస్క్: పురావస్తు శాఖ తవ్వకాల్లో 3 వేల ఏళ్లనాటి ఓ పురాతన నగరం బయటపడింది. అంత పురాతన నగరమా.. ఎక్కడ అనుకుంటున్నారా.. ఇంకెక్కడా… ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు కేరాఫ్ అడ్రెస్ అయిన ఈజిప్టులో. చాలా దేశాలకు చెందిన పరిశోధకులు కనుగొనలేని ఈ నగరాన్ని, ఈజిప్టు శాస్త్రవేత్తలు మొదటి ప్రయత్నంలో గుర్తించడం హర్షించదగ్గ విషయం.
ఈ బయటపడ్డ నగరం పేరు “అటెన్”. ఇన్ని వేల ఏళ్లు అయినా ఆ నగరపు గోడలు చెక్కు చెదరని స్థితిలో ఉన్నాయంటే అప్పటి నైపుణ్యాన్ని అభినందించక తప్పదు. ఆ నగరంలో నివాస సముదాయాలను, సమాధులు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటికి సంబంధించిన విషయాలను ప్రముఖ చరిత్రకారుడు, పురావస్తు శాత్రవేత్త జాహీ హవాస్ వివరించారు.
రాజుల లోయగా పిలిచే “లగ్జర్” కు దగ్గరలో దీన్ని గుర్తించినట్టు తెలిపారు. ఇది ఎమెనోటెప్ 3 కాలానికి చెందినదని. ఈజిప్ట్ లో ఇప్పటిదాకా గుర్తించిన పురాతన నగరాల్లో ఇదే అతిపెద్దదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు ఏడు నెలల పాటు సాగిన తవ్వకాల్లో నగరంతో పాటు ఎన్నో ఆభరణాలు, బీటిల్ పురుగులకు సంబంధించిన ఆనవాళ్లు, మట్టి ఇటుకలను వెలికి తీశారు. ఆనాడు ఇళ్లలో ప్రజలు వాడే మట్టి పొయ్యిలు, పనిముట్లు, పూలు పెట్టుకునే వాజులు, మట్టి కుండలు, నాటి మనుషుల అస్థిపంజరాలను బయటపడినట్లు తెలిపారు.