- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను జయించిన పది నెలల బాలుడు
ఇరాన్ లో , ఆ తర్వాత కేరళలో వృద్ధులు కరోనాపై విజయం సాధించి డిశ్చార్జి అయిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా పది నెలల బాలుడు కరోనా మహమ్మారిని జయించాడు. తమిళనాడుకు చెందిన ఈ బాలుడు కోయంబత్తూరులోని ఈఎస్ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
కరోనా మహమ్మారి ఎవరినీ వదిలి పెట్టదు. చిన్నారుల నుంచి వృద్దుల వరకు అందరికీ ఇది సోకుతుంది. అయితే వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతోన్న దాని ప్రకారం.. చిన్నపిల్లలు, వృద్దుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వారిపై వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఇరాన్, ఇటలీ, కేరళలో వృద్దులు వైరస్ బారినుంచి కోలుకుని ఔరా అనిపించారు. తమిళనాడులో 10 నెలల బాలుడు కూడా కరోనా వైరస్ నుంచి బయటపడ్డాడు..
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బాలుడికి కరోనా వైరస్ సోకింది. అతని కుటుంబ సభ్యులతోపాటు గతనెల 29వ తేదీన ఈఎస్ఐ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అప్పటినుంచి చిన్నారిని వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వారం రోజుల నుంచి ఐసోలేషన్ లోనే ఈ బాబును ఉంచారు. ఈ చిన్నారికి మళ్లీ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని తేలడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. ఆ బాలుడి తల్లి రైల్వే డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఓ పేషెంట్ ద్వారా ఆమెకు కరోనా సోకగా.. తల్లి నుంచి ఆ పసివాడికి కోవిడ్ సోకింది. హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచిన అనంతరం ఆ బాలుడితోపాటు అతడి తల్లి శాంపిళ్లను రెండు సార్లు పరీక్షించగా నెగటివ్ అని తేలింది. దీంతో వారిని డిశ్చార్జ్ చేశారు.
Tags: corono virus, tamilnadu,isolation. possitve, negative, 10months boy