Sun intensity :ఏపీలో తగ్గేదేలే అంటున్న ఎండ తీవ్రత

by Naveena |
Sun intensity :ఏపీలో తగ్గేదేలే అంటున్న ఎండ తీవ్రత
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బయటకు వెళ్తే చాలు ఎండ నిప్పుల కొలవిులా భగభగ మండుతుంది. మధ్యాహ్నమే కాదు సాయంత్రం కూడా ఎండ తగ్గేదేలే అంటూ సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం (07-04-25) రాయలసీమలో 40-42°C, ఉత్తరాంధ్రలో 39-41°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందన్నారు. ఎండదెబ్బ తగలకుండా ప్రజలు టోపీ, గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరం అయితే తప్ప మధ్యాహ్నం సయమంలో బయటికి రాకుండా ఉండాలని కోరారు. ఉదయం, సాయంత్రం సమయాల్లోనే బయటి పనులు చక్కబెట్టుకోవాలని పేర్కొన్నారు. అలాగే శరీరానికి చలువు చేసే పానీయాలు తీసుకోవాలన్నారు.

Next Story

Most Viewed