Rain Alert:రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు.. ఆ మూడు రోజులు వర్షాలే!

by Jakkula Mamatha |   ( Updated:2025-03-29 11:38:43.0  )
Rain Alert:రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు.. ఆ మూడు రోజులు వర్షాలే!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత(temperature)లు నమోదవుతున్నాయి. ఉదయాన్నే భానుడు తీవ్ర ప్రభావం చూపడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు మండే ఎండలు, మరోవైపు తీవ్ర వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందింది. వచ్చే నెల(ఏప్రిల్) 2, 3, 4వ తేదీల్లో తెలంగాణ(Telangana)లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. ఈ తరుణంలో రాష్ట్రంలోని ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందనే చెప్పవచ్చు. ఇక నేటి(శనివారం) నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు(temperature) 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో 36-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed