నా వయసు 55.. నేను వయాగ్రా వాడొచ్చా?

by Bhoopathi Nagaiah |
నా వయసు 55.. నేను వయాగ్రా వాడొచ్చా?
X

డాక్టర్! నా వయసు 57 సంవత్సరాలు. ఈ మధ్య అంగస్తంభన(erectile dysfunction) సమస్య మొదలైంది. హార్ట్ స్టంట్ (Heart Stunt)వేశారు. నేను వయాగ్రా (Viagra) వాడొచ్చా? మా బావగారు తను బీపీ ఉన్నా మెడికల్ షాప్‌లో దానిని కొనుక్కుని వాడతారు. నన్నూ వాడమంటున్నారు. పోనీ, సెక్స్ హార్మోన్స్ ఇంజెక్షన్లు(Sex hormone injections) టెస్టోస్టిరాన్ (Testosterone) వాడచ్చా? - పి.ఎస్.టి., ఆదిలాబాద్

మీ బావగారు డాక్టర్ కాదు. పైగా బీపీ పెట్టుకొని డాక్టర్ పర్యవేక్షణలో వయాగ్రా లాంటి ప్రమాదకర మందుని వాడుతూ మిమ్మల్ని వాడమని తప్పుడు సలహా ఇస్తున్నారు. ముందు ఆయన్ని వయాగ్రా మానేయమని చెప్పండి. బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులున్న వారు వయాగ్రా వాడకూడదు. అయితే, టెస్టోస్టిరాన్ రక్తంలో తగ్గితే ఖచ్చితంగా అంగస్తంభనాలు తగ్గుతాయి. పరీక్ష చేయించుకుని ప్రతి మిల్లీమీటరు రక్తంలో 3 నానో గ్రాముల కంటే తక్కువ ఉన్న వాళ్ళే ఈ టెస్టోస్టిరాన్ తీసుకోవాలి. ఒక్కోసారి ఈ ఇంజక్షను తర్వాత టెస్టోస్టిరాన్ హార్మోన్ల స్థాయి పడిపోయే అవకాశం ఉంటుంది. యాభై దాటాక టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయి తగ్గుతూ వస్తుంది. వీరికి టెస్టోస్టిరాన్ ఆండ్రాలజిస్టు పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. అలాగే, అంగస్తంభన సమస్యకు ఇతర కారణాలు (ఉదా: డయాబెటిస్, బీపీ, లివరు, కిడ్నీ, ప్రోస్టేటు లాంటి వ్యాధులేమైనా) కూడా కనుక్కోవాలి. మీకెలాగూ గుండె జబ్బువల్లే ఈ సమస్య వచ్చింది. కాబట్టి, మీరు వయాగ్రా అసలు వాడకండి. దీనివల్ల హఠాత్తుగా గుండెపోటు రావచ్చు. బీపీ ఉన్న వాళ్ళు వయాగ్రా వేసుకున్న ఇంతే! మీరు సెక్సాలజిస్టును మీ భార్యతో సహా కలవండి. మెరైటల్ థెరపీలో కొన్ని సూచనలు పాటించడం వల్ల గుండెపై భారం పడకుండా జాగ్రత్తలు తీస్కుంటూ సెక్స్‌లో పాల్గొనవచ్చు. జీవించి ఉండటం కంటే సెక్సు ముఖ్యం కాదు కదా? కొన్ని మంచి ప్రాకృతిక మందులు వైద్య లక్షణాలున్న ఆహార పదార్థాలు వాడుకుంటూ మంచి శృంగార జీవితాన్ని మీ ఆరోగ్యం చెడకుండా పొందవచ్చు.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story

Most Viewed