నాకు చిన్నప్పటి నుంచి సెక్స్ కోరికలు ఎక్కువ.. రోజూ మా వారితోపాటు బాయ్‌ఫ్రెండ్‌తోనూ పాల్గొంటున్న కానీ..

by Bhoopathi Nagaiah |
నాకు చిన్నప్పటి నుంచి సెక్స్ కోరికలు ఎక్కువ.. రోజూ మా వారితోపాటు బాయ్‌ఫ్రెండ్‌తోనూ పాల్గొంటున్న కానీ..
X

నాకు పెళ్ళయి 12 సంవత్సరాలు అవుతోంది. ఇద్దరు పిల్లలు. నాకు చిన్నప్పటి నుంచి సెక్స్ కోరికలు ఎక్కువ. మా ఆయనతో రోజూ సెక్స్‌లో పాల్గొన్నా కూడా వీలు దొరికినప్పుడల్లా మా బాయ్ ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొంటున్నాను. ఒకసారి దొరికి పోయాను. ఇంట్లో అందరూ తిట్టారు, కొట్టారు కూడా, పరువు పోయిందని ఆత్మహత్యకు ప్రయత్నించినా విఫలమైంది. అయినా, నా పద్ధతి మార లేదు. పిల్లలు అనాథలు కాకూడదని మా ఆయన నన్ను భరిస్తున్నారు. నేను చేసేది తప్పు అని నాకు తెలుసు. కానీ, మానలేకపోతున్నాను. మా ఆయనతో, పిల్లలతో కలిసి ఆనందంగా ఉండాలని ఉంది. నన్నేం చేయమంటారు. నేను పెరిగింది చెడు వాతావరణంలో కాబట్టి ఇలా అలవాటైంది. నా సెక్స్ కోరికలను తగ్గించుకోవడానికి ఏవైనా మార్గాలుంటే చెప్పండి. ఏవైనా టాబ్లెట్స్ వుంటే రాయండి?

మీ ఆయనతో, పిల్లలతో సంతోషంగా ఉండాలన్న కోరికే నీలో మార్పుని తీసుకొస్తుంది. నీలో ఘర్షణ, పశ్చాత్తాపం నిన్ను మారుస్తాయి. సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్ వద్ద మనోలైంగిక చికిత్స తీసుకో. అవధులు లేని సెక్స్ కోరికలు, ఎక్కువ మందితో సెక్సు సంబంధాలు ఒక రకమైన మనోలైంగిక సమస్య. నువ్వు పెరిగిన వాతావరణం కూడా కారణం. అయితే, ఇప్పుడు ఆ వాతావరణంలో లేవు కదా? నీ బలహీనతలను క్షమించి భరించే భర్త, ఇద్దరు పిల్లలు, వాళ్ళ బాధ్యత నీ మీదున్నాయి. పిల్లల జీవితం పైన తల్లిదండ్రుల నడవడిక చాలా ప్రభావాన్ని చూపుతుంది. నీ అనైతిక జీవన ప్రభావం నీ పిల్లలు పెరిగాక వారిమీద పడి వారి జీవితం నాశనమయ్యే అవకాశం ఉంది. కన్నబిడ్డలతో అసహ్యించుకోవడం నీకు గౌరవమా? వెంటనే మనోలైంగిక చికిత్స తీసుకో. నీ జీవితం బాగుపడుతుంది.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story

Most Viewed