- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నెలరోజుల్లోనే ఓటీటీలోకి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బామర్ధి నార్కే నితిన్ హీరోగా నటించిన మూవీ ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి మణిపుత్ర దర్శకత్వం వహించగా.. నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. గోదావరి బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఆయ్ మూవీని GA2 బ్యానర్‌పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మించారు. ఇందులో రాజ్ కుమార్, కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి కీలక పాత్రలో నటించి మెప్పించారు.
ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై యూత్‌ను ఆకట్టుకోవడంతో పాటు సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఆయ్ డిజిటల్ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Oorlo edhavalu ante, andharu first anukunedhi veelane. Aay veelu friends andi.#Aay is coming to Netflix on 12 September in Telugu, Tamil, Malayalam and Kannada!#AayOnNetflix pic.twitter.com/5BhXMTzLWy
— Netflix India South (@Netflix_INSouth) September 7, 2024