నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

by Hamsa |
నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలామంది నటనపై ఆసక్తితో బుల్లితెర నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ తమ క్రేజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తుండానే తమ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న సెలబ్రిటీలను ఎంతోమందిని చూశాం. ఇక బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది నటీనటులు పరిచయం అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా హీరోలుగా కూడా పలు సినిమాల్లో నటిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలా వచ్చిన వారిలో ధనరాజ్(Dhanraj) కూడా ఒకరు.

జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన ఆయన పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇక ఇటీవల ధనరాజ్ ఏకంగా ఓ సినిమానే తెరకెక్కించడం విషేశం. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘రామం రాఘవం’(Ramam Raghavam). ఇందులో సముద్రఖని(Samuthirakani ), వెన్నెల కిషోర్(Vennela Kishore), సత్య, శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy), సునీల్, పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించారు.

అయితే తండ్రి కొడుకు బంధం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ హిట్ అందుకోలేకపోయింది. తాజాగా, ‘రామం రాఘవం’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ హక్కులను ప్రముఖ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకోగా.. మార్చి 14 నుంచి తెలుగు, తమిళంలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Next Story