మోడీకి భయపడి నడ్డాకు ఈసీ నోటీసులు ఇచ్చింది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
మోడీకి భయపడి నడ్డాకు ఈసీ నోటీసులు ఇచ్చింది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ 48 గంటలు నిషేధం విధించడం వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపంచారు. ప్రధాని మోడీ, అమిత్ షా మత విద్వేషాలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోదని అన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో ముస్లింలను బండ బూతులు తిడుతున్నారు. నరేంద్ర మోడీ ముస్లింలపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. మోడీకి నోటీసులు ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ భయపడి నడ్డాకు నోటీసు ఇచ్చారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి బొమ్మ పట్టుకుని అమిత్ షాతో పాటు మీరట్ ఎంపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ ప్రచారం చేస్తున్నారు. అయినా ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కేసీఆర్ విషయంలో ఆగమేఘాల మీద ఈసీ నోటీసులు ఇచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. రైతుల విషయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్లలో కేసీఆర్ మాట్లాడారు. నేతన్నలపై కాంగ్రెస్ నేత మాట్లాడిన భాషను కేసీఆర్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇప్పటివరకు 8 సార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాము. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రవచనాల్లాగా ఈసీకి కనిపిస్తున్నాయా...? అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ పార్టీ తరపున 28 ఫిర్యాదులు ఇచ్చాము. కొండా సురేఖ వ్యాఖ్యలపై మాత్రమే ఈసీ మందలించింది. కేసీఆర్ బయటకు రాగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో మోడీకి వణుకు పుట్టిందని విమర్శించారు. బడా భాయ్ మోడీ, చోటా భాయ్ రేవంత్ మోసాలను కేసీఆర్ ప్రజలకు చెప్తున్నారు. కేసీఆర్‌కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు నిద్ర పట్టడం లేదు. తెలంగాణ ప్రజలు ఓటుతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్తారని అన్నారు.

Read More..

నేను జైలుకు పోవడానికి సిద్ధం.. మాజీ మంత్రి KTR ప్రకటన

Next Story

Most Viewed