- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ ప్రత్యర్థిపై 242 క్రిమినల్ కేసులు.. పత్రికా ప్రకటనలో వెల్లడి
దిశ, నేషనల్ బ్యూరో: కేరళ బీజేపీ అధ్యక్షుడు, వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్‌పై పోటీ చేస్తున్న కే సురేంద్రన్‌పై ఏకంగా 242 క్రిమినల్ కేసులు నమోదైనట్టు వెల్లడైంది. ఎన్నికల నేపథ్యంలో నిబంధనల ప్రకారం, తనపై ఉన్న కేసులను సురేంద్రన్ పత్రికా ప్రకటన ద్వారా తాజాగా వెల్లడించారు. సురేంద్రన్‌తోపాటు ఎర్నాకుళం నుంచి పోటీ చేస్తున్న మరో బీజేపీ అభ్యర్థి కేఎస్ రాధాక్రిష్ణన్‌పైనా 211 కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. ‘‘వీరిపై నమోదైన కేసుల్లో ఎక్కువగా 2018లో చేపట్టిన శబరిమల నిరసనలకు సంబంధించినవే. ఈ కేసులన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. పార్టీ లీడర్లు సమ్మె లేదా ఆందోళనలకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఈ కేసులు అలా నమోదైనవే’’ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జార్జ్ కురియన్ వెల్లడించారు. ఇదే అంశంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సైతం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జాతీయవాదిగా ఉండటం చాలా కష్టం. అలా ఉండటం రోజువారీ పోరాటంతో సమానం. కానీ, ఆ పోరాటం ఎంతో విలువైనది. ఒక్క వ్యక్తి.. వందలాది కేసులు’’ అని పేర్కొంటూ సురేంద్రన్‌ను ట్యాగ్ చేశారు.