ఆ పోస్టుతో కోహ్లీ ఫ్యాన్స్ షాక్.. తీరా.. ఏప్రిల్ ఫూల్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన ఫ్రాంచైజీ

by Harish |
ఆ పోస్టుతో కోహ్లీ ఫ్యాన్స్ షాక్.. తీరా.. ఏప్రిల్ ఫూల్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన ఫ్రాంచైజీ
X

దిశ, స్పోర్ట్స్ : విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్‌ ఆడుతూ బిజీగా ఉన్నాడు. అయితే, అతని గురించి ఓ వార్త భారత అభిమానులను మంగళవారం కాసేపు గందరగోళంలో పడేసింది. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో కోహ్లీ ఆడబోతున్నాడనే వార్త అందరిని షాక్‌కు గురి చేసింది. కానీ, కాసేపటికే అసలు విషయం బయటపడటంతో ఫూల్ అయ్యామని తెలుసుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. బీబీఎల్ ఫ్రాంచైజీ, మూడుసార్లు చాంపియన్ అయిన సిడ్నీ సిక్సర్స్ విరాట్ కోహ్లీ బీబీఎల్ ఆడబోతున్నాడని, రెండు సీజన్లకు అధికారికంగా ఒప్పందం చేసుకున్నాడని ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారింది. మిలియన్‌కుపైగా వ్యూస్ వచ్చాయి. విరాట్ బీబీఎల్ ఆడటం ఏంటి? అని ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, కాసేపటికే సిడ్నీ సిక్సర్స్ క్లారిటీ ఇచ్చింది. కోహ్లీ బీబీఎల్‌తో ఒప్పందం చేసుకోలేదని, ఏప్రిల్ 1వ తేదీ సందర్భంగా పోస్టు పెట్టినట్టు తెలిపింది. మొదటి పోస్టును ట్యాగ్ చేస్తూ ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ మరో పోస్టు పెట్టింది. భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌లు ఆడటానికి అనుమతి లేదు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవడమే కాకుండా ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్లు మాత్రమే విదేశీ లీగ్‌ల్లో ఆడొచ్చు.



👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story