- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL 2025: బ్రూక్‌పై వేటు సరైందే.. బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించిన మెయిన్ అలీ, ఆదిల్ రషీద్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం.. వేలంలో ఎంపికైన తర్వాత లీగ్‌కు అందుబాటులో ఉండాల్సిందే. లేదంటే రెండేళ్లు నిషేధం తప్పదని బోర్డు వేలానికి ముందే తెలిపింది. బ్రూక్ ఈ రూల్‌ను అతిక్రమించడంతో వేటు పడింది. బ్రూక్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఇంగ్లాండ్‌కే చెందిన క్రికెటర్లు మెయిన్ అలీ, ఆదిల్ రషీద్ సమర్థించారు. బ్రూక్‌పై వేటు సరైందేనని చెప్పారు. ‘గతంలో చాలా మంది ఇలాగే చేశారు. తమకు నచ్చినప్పుడు తిరిగి వచ్చి బెటర్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ పొందుతారు. కాబట్టి, బీసీసీఐ నిర్ణయం కఠినమైంది కాదు. నేను సమర్థిస్తున్నా. బ్రూక్ తప్పుకుని తన జట్టును గందోరగోళానికి గురిచేశాడు. వారు ప్రతిదీ పునరుద్ధరించుకోవాలి.’ అని మెయిన్ అలీ ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపాడు. ఆదిల్ రషీద్ కూడా బ్రూక్ చేసింది కరెక్ట్ కాదని వ్యాఖ్యానించాడు. ‘వేలం కంటే ముందే ఆ రూల్‌ను తీసుకొచ్చారు. మీ పేరు ఇచ్చేటప్పుడే తప్పుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. కాబట్టి, అతనిపై నిషేధం కఠినమైంది కాదు. 5-10 ఏళ్లలో చాలా మంది ఎంపికైన తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. అందుకే, ఆ రూల్ తీసుకొచ్చారు.’అని రషీద్ చెప్పుకొచ్చాడు.