- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
చెన్నయ్ సూపర్ కింగ్స్ నెక్స్ట్ కెప్టెన్ ఆయనే..!
దిశ, వెబె డెస్క్: 2008లో ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి చెన్నయ్ సూపర్ కింగ్స్ (సీఎస్కే) టీమ్ కు ధోనీయే కెప్టెన్ గా ఉంటున్నాడు. గత ఐపీఎల్ సీజన్ లో కొన్ని మ్యాచులకు రవీంద్ర జడేజా కెప్టెన్ గా వ్యవహరించినప్పటికీ.. అతడు ఘోరంగా విఫలం కావడంతో కెప్టెన్సీ బాధ్యతలు మళ్లీ ధోనీనే తీసుకున్నాడు. అయితే వచ్చే సీజన్ లో ఐపీఎల్ కు ధోనీ గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీఎస్కే నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే సందేహం ఐపీఎల్ అభిమానుల్లో నెలకొంది. రవీంద్ర జడేజా, అంబటి రాయుడు తదితర పేర్లు వినపడుతున్నప్పటికీ సీఎస్కే మేనేజ్మెంట్ మాత్రం స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ వైపే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2021లో సీఎస్కే తరఫున ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన గైక్వాడ్.. 2021 సీజన్ లో మొత్తం 16 మ్యాచులు ఆడి 635 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2022 సీజన్ లో కూడా రుతురాజ్ బాగానే రాణించాడు. 14 మ్యాచుల్లో 368 రన్స్ చేశాడు. ఇక ప్రస్తుత సీజన్ లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గైక్వాడ్ హాఫ్ సెంచరీలు చేశాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో 92 పరుగులు చేసిన గైక్వాడ్.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 57 పరుగులు చేశాడు. ఇక రుతురాజ్ కు కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భారత మాజీ క్రెకెటర్ దీస్ దాస్ గుప్తా చెప్పారు.
టాటా ఐపీఎల్ 2023లో గైక్వాడ్ చేసిన రెండు హాఫ్ సెంచరీలు చూస్తే అతడు ఎంత పర్ఫెక్ట్ ఆటగాడో అర్థమవుతుందని అన్నారు. గత మూడేళ్లుగా సీఎస్కే తరఫున గైక్వాడ్ ఆడుతున్నారని.. జట్టు గురించి, మేనేజ్మెంట్ గురించి అతడికి పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. ఇవన్నీ కెప్టెన్ అవ్వడానికి రుతురాజ్ కు ఉపకరిస్తాయని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా సీఎస్కే కెప్టెన్ గా కావడానికి మ్యాస్ట్రో మైండ్ ధోనీ సపోర్ట్ కూడా గైక్వాడ్ కు పుష్కలంగా ఉందని క్రికెట్ సర్కిల్ లో చర్చించుకుంటున్నారు.