డూ ఆర్ డై మ్యాచ్‌లో ఫైటింగ్ స్కోర్ చేసిన RCB.. ఆర్ఆర్ టార్గెట్ ఎంతంటే..?

by Satheesh |
డూ ఆర్ డై మ్యాచ్‌లో ఫైటింగ్ స్కోర్ చేసిన RCB.. ఆర్ఆర్ టార్గెట్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ట్రోఫీ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాటర్లు తడబడ్డారు. లీగ్ సెకండ్ ఫేజ్‌లో అద్భుత విజయాలు సాధించి ఊహించని విధంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుని తీరా డూ ఆర్ డై అయిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోలేక పోయారు. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, బెంగుళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కోహ్లీ 33, డుప్లెసిస్ 17, గ్రీన్ 27, పటిదార్ 34, లామ్రోర్ 32, దినేష్ కార్తీక్ 11 పరుగులు చేశారు. స్టార్ బ్యాటర్ మాక్స్‌వెల్ కీలకమైన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యి మరోసారి తీవ్రంగా నిరాశ పర్చాడు. ఆర్ఆర్ బౌలర్లలో యంగ్ బౌలర్ అవేష్ ఖాన్ 3 వికెట్లతో రాణించాడు. అశ్విన్ 2, చాహల్ 1, బౌల్ట్ 1, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. అనంతరం ఆర్ఆర్ 173 పరుగుల మోస్తారు టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగింది.

Advertisement

Next Story

Most Viewed