టీ20 ప్రపంచకప్‌‌ సన్నద్ధతకు ఐపీఎల్ సరైన వేదిక : యశస్వి జైశ్వాల్

by Harish |
టీ20 ప్రపంచకప్‌‌ సన్నద్ధతకు ఐపీఎల్ సరైన వేదిక : యశస్వి జైశ్వాల్
X

దిశ, స్పోర్ట్స్ : త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు సన్నద్ధం కావడానికి ఐపీఎల్ సరైన వేదిక అని టీమ్ ఇండియా, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తెలిపాడు. ఇటీవల పొట్టి ప్రపంచకప్‌కు ప్రకటించిన భారత జట్టులో యశస్వి జైశ్వాల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.

శనివారం ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌లో జైశ్వాల్ మాట్లాడుతూ.. ప్రపంచకప్ కోసం భారత జట్టు సన్నాహాల్లో ఐపీఎల్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాడు. ‘ఐపీఎల్ ద్వారా చాలా నేర్చుకోవచ్చు. చాలా అనుభవం పొందొచ్చు. టీ20 ప్రపంచకప్‌లో బాగా ఆడేందుకు ఐపీఎల్ సరైన వేదిక. ఐపీఎల్ ఆడటం మాకు చాలా ఉపయోగపడుతుంది. ప్రపంచకప్‌లో మేము తలపడే ఆటగాళ్లతోనే ఐపీఎల్‌లో ఆడుతున్నాం. కాబట్టి వాళ్ల గురించి మాకు తెలుసు. దీనివల్ల, మేము ఇంకా బాగా సన్నద్ధం అవడానికి వీలు ఉంటుంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్‌లో రాజస్థాన్ తరపున జైశ్వాల్ 10 మ్యాచ్‌ల్లో 316 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.

Advertisement
Next Story