MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. పెవీలియన్ చేరిన రోహిత్, ఇషాన్, సూర్య

by Shiva |
MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. పెవీలియన్ చేరిన రోహిత్, ఇషాన్, సూర్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ మైదానం వేదిగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ జట్టు ఆడిన 7 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లలో గెలపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదేవిధంగా ముంబై వరుస పరాజయాలతో ఆడిన 7 మ్యాచ్‌లలో కేవలం 3 మ్యాచ్‌‌లలో విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ బ్యాటింగ్ విభాగం శత్రు దుర్భేద్యంగా కనిపిస్తోంది. కెప్టెన్ సంజూ శామ్సన్, యశస్వీ జైస్వాల్, రియాన్ పరాగ్, జోస్ బట్లర్ మంచి ఫాంలో ఉన్నారు. పపర్ ప్లేలో వేగంగా బ్యాటింగ్ చేస్తూ.. ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు చేస్తున్నారు. ఇక బౌలింగ్‌లోనూ ఆ జట్టు అదరగొడుతోంది. ట్రెంట్ బౌల్ట్, యజ్వేంద్ర చాహాల్, సందీప్ శర్మ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇక ముంబై జట్టు విషయానికొస్తే సమిష్టిగా రాణించడంలో పూర్తిగా విఫలం అవుతోంది. ఒక్క రోహిత్, తిలక్ వర్మ మినహా బ్యాట్స్‌మెన్లు ఎవరూ బ్యాటింగ్ రాణించడం లేదు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా మాత్రమే చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు.

ముందుగా టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ కేవలం 4 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా సందీప్ శర్మ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ముంబై జట్టు 6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. తిలక్ వర్మ 6 బంతుల్లో 5 పరుగులు, మహమ్మద్ నబీ 13 బంతుల్లో 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed