అతని కంటే మెరుగ్గా సిక్స్‌లు కొట్టే వాళ్లు ఉన్నారా? : ఆకాశ్ చోప్రా

by Harish |
అతని కంటే మెరుగ్గా సిక్స్‌లు కొట్టే వాళ్లు ఉన్నారా? : ఆకాశ్ చోప్రా
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్ బ్యాటర్ శివమ్ దూబెపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్‌కు దూబె లాంటి హిట్టర్ అవసరాన్ని నొక్కిచెప్పాడు. ‘5వ లేదా 6వ స్థానంలో అతను ఎంత బాగా ఆడుతున్నాడు. అతని కంటే మెరుగ్గా సిక్స్‌లు కొట్టే వారు భారత జట్టులో ఎవరైనా ఉన్నారా?. విండీస్, అమెరికా పిచ్‌లు స్లో‌గా ఉంటాయి. మైదానాలు పెద్దగా ఉంటాయి. కాబట్టి, పవర్‌ఫుల్ బ్యాటర్లు కావాలి. దూబె సరిగ్గా సరిపోతాడు.’ అని చెప్పాడు.

కాగా, ఐపీఎల్-17 చెన్నయ్ తరపున శివమ్ దూబె అదరగొడుతున్నాడు. బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో 34 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోసించాడు. ఇక, గుజరాత్‌తో మ్యాచ్‌లో దూబె విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడ. ఎడాపెడా సిక్స్‌లు బాదిన అతను 23 బంతుల్లో 51 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ మ్యాచ్‌లో గుజరాత్‌పై చెన్నయ్ 63 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

Advertisement

Next Story