మూడు రోజులు బెడ్‌పైనే.. పెయిన్ కిలర్స్ తీసుకుని వచ్చి ఢిల్లీ బౌలర్లను ఊతికారేశాడు

by Harish |
మూడు రోజులు బెడ్‌పైనే.. పెయిన్ కిలర్స్ తీసుకుని వచ్చి ఢిల్లీ బౌలర్లను ఊతికారేశాడు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు రియాన్ పరాగ్ అనారోగ్యం బారినపడ్డాడట. మూడు రోజులు బెడ్‌పైనే ఉన్నాడట. పెయిన్ కిల్లర్స్‌ తీసుకుని మరి ఈ మ్యాచ్‌కు అందుబాటులో వచ్చాడట. ఈ విషయాన్ని రియాన్ పరాగ్ స్వయంగా వెల్లడించాడు.

ఢిల్లీతో మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘మా అమ్మ ఇక్కడే ఉంది. గత 3-4 ఏళ్లుగా ఆమె నా కష్టాలను చూసింది. ఇప్పుడు నా ఆట పట్ల గర్వపడే ఉంటుంది.’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఈ మ్యాచ్‌కు ముందు మూడు రోజులు బెడ్‌పైనే ఉన్నా. పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను.’ అని రియాన్ పరాగ్ తెలిపాడు.

రాజస్థాన్ తరపున రియాన్ పరాగ్ అదరగొడుతున్నాడు. లక్నో తొలి మ్యాచ్‌లో 43 పరుగులతో రాణించిన అతను.. ఢిల్లీపై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Next Story

Most Viewed