IPL 2023: వెంకటేశ్‌ అయ్యర్‌ విధ్వంసక సెంచరీ.. ముంబై టార్గెట్ ఎంతంటే..?

by Vinod kumar |
IPL 2023: వెంకటేశ్‌ అయ్యర్‌ విధ్వంసక సెంచరీ.. ముంబై టార్గెట్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కేకేఆర్ హిట్టర్ వెంకటేష్ అయ్యర్ సెంచరీతో చెలరేగాడు. 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అయ్యర్‌.. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం బాదాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లంతా కలిపి కేవలం 2 ఫోర్లు కొడితే, ఒక్క వెంకటేశ్‌ అయ్యరే 5 బౌండరీలు, 9 సిక్సర్లు బాదడం విశేషం. చివర్లలో రసెల్ 9 బంతుల్లో 16 చేశాడు. ముంబై బౌలర్స్‌లో.. హృతిక్ షాకీన్ 2, పీయూష్ చావ్లా, జాన్సన్, గ్రీన్, మెరిడిత్ తలో వికెట్ తీశారు.

Advertisement

Next Story