నేడు ఉప్పల్ స్టేడియంలో SRH vs PBKS..

by Mahesh |
నేడు ఉప్పల్ స్టేడియంలో SRH vs PBKS..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో బాగంగా హైదరాబాద్ వేదికగా 14వ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ జట్టుకు ఈ సీజన్‌లో హాట్రిక్ విజయం దక్కుతుంది. అలాగే SRH‌కు కూడా హాట్రిక్ ఓటిమి అందుతుంది. దీనిని అధిగమించడానికి హైదరాబాద్ జట్టు విఫల ప్రయత్నం చేస్తుంది. అలాగే SRH జట్టుకు ఐపీఎల్ లో హోమ్ గ్రౌండ్ పులులు అని బిరుదు ఉంది.

ఎందుకంటే ఇప్పటి వరకు జరిగి అన్ని సీజన్లలో SRH జట్టు హోమ్ గ్రౌండ్‌లోనే ఎక్కువ విజయాలు సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలావాలి అనే గట్టీ పట్టుదలతో SRH జట్టు కనబడుతుంది. అలాగే వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ లో కూడా తమకు విజయం ఖాయమని ధీమాతో ఉంది. మరీ ఈ మ్యాచ్ లో ఎవరు హాట్రిక్ కొడతారో తెలియాలి అంటే సాయంత్రం 7.30 వరకు వేచి చూడాల్సిందే మరి.

SRH ప్లేయింగ్ 11 అంచనా జట్టు: మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్ (WK), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ (సి), హ్యారీ బ్రూక్/హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, ఫజల్హక్ ఫరూఖీ

PBKS ప్లేయింగ్ 11 అంచనా జట్టు: ప్రభసిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (సి), భానుకా రాజపక్స/మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ (WK), సికందర్ రజా, సామ్ కుర్రాన్, M షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్

Advertisement
Next Story

Most Viewed