- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: నేడు డబుల్ ధమకా.. రాజస్థాన్‌తో ఢిల్లీ తాడోపేడో.. చెన్నైను ఢీకొట్టనున్న రోహిత్ సేన
ముంబై: ప్రతి సీజన్‌లాగే ఐపీఎల్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితోనే ఆరంభించింది. బెంగళూరు చేతిలో ఓటమిపాలైంది. అయితే, ఇతర జట్లు లీగ్‌లో ముందడుగు వేస్తుండటం, గత సీజన్లతో పోలిస్తే ముంబై బలహీనంగా కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంతో రోహిత్ సేన ఖాతా తెరవాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం రాత్రి చెన్నయ్‌తో జరిగే మ్యాచ్‌తో బోణీ కొట్టాలని ముంబై భావిస్తున్నది. తొలి మ్యాచ్‌లో దారుణంగా నిరాశపర్చిన రోహిత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, గ్రీన్ నేటి మ్యాచ్‌లో పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. బెంగళూరుపై సత్తాచాటిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ నుంచి జట్టు మరో ఇన్నింగ్స్ ఆశిస్తున్నది.
బుమ్రా స్థానాన్ని భర్తీ చేస్తాడుకున్న జోఫ్రా ఆర్చర్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం జట్టును ఆందోళనకు గురిచేస్తున్నది. రెండో మ్యాచ్‌లో చెన్నయ్‌ను అడ్డుకోవాలంటే బౌలర్లు రాణించాల్సిందే. మరోవైపు, చెన్నయ్ పరిస్థితి మరోలా ఉంది. లక్నోపై గెలిచి ఖాతా తెరిచినా ఆ జట్టు పూర్తి సంతృప్తిగా లేదు. బౌలర్లు భారీ పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టుకు నష్టాన్ని చేకూరుస్తున్నది.
గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చిన స్టార్ పేసర్ దీపక్ చాహర్‌తోపాటు సాంట్నర్, హంగర్గేకర్ ముంబైపై చెలరేగాల్సిన అవసరం ఉన్నది. బ్యాటింగ్ పరంగా రుతురాజ్ గైక్వాడ్ చెన్నయ్‌కు ప్రధాన బలం. రెండో మ్యాచ్‌తో మరో ఓపెనర్ కాన్వే కూడా ఫామ్ అందుకున్నట్టు కనిపించాడు. శివమ్ దూబే, మొయిన్ అలీ, స్టోక్స్, రాయుడు, జడేజా, ధోనీలతో బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉన్నా.. తమ స్థాయి ప్రదర్శన చేయడం లేదు. వీరు గనుక పుంజుకుంటే చెన్నయ్‌కు తిరుగుండదు.
ఈ సారైనా ఢిల్లీ..
లీగ్‌లో ఖాతా తెరవని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి బోణీ కోసం ఎదురుచూస్తున్నాడు. నేడు గువహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నది. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్ల ప్రదర్శన దారుణంగా ఉన్నది. అక్షర్ పటేల్ వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నా ఏ ఒక్కరూ సత్తాచాటలేకపోయారు. తొలి మ్యాచ్‌లో వార్నర్ హాఫ్ సెంచరీ చేసినా.. రెండో మ్యాచ్‌లో క్రీజులో నిలవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.
నేటి మ్యాచ్‌లో ముఖ్యంగా పృథ్వీషా.. వార్నర్‌తో కలిసి శుభారంభం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిచెల్ మార్ష్, రోసోవ్, పొవెల్, సర్ఫరాజ్ ఖాన్ తమ బాధ్యతలను నిర్వర్తించాలి. నాణ్యమైన బౌలర్లతో ఢిల్లీ బలంగా ఉన్నా.. బ్యాటింగ్ దళమే పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. పంజాబ్ చేతిలో ఓడిన రాజస్థాన్.. ఢిల్లీపై నెగ్గి మళ్లీ పట్టాలెక్కాలని భావిస్తున్నది. పంజాబ్‌పై ఓడినా ఆఖర్లో ఆ జట్టుకు చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. యశస్వి జైశ్వాల్, బట్లర్, శాంసన్‌లతో జట్టు పటిష్టంగా ఉన్నా.. పడిక్కల్, రియాన్ పరాగ్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. ఫినిషర్ రోల్‌లో హెట్మేయర్, ధ్రువ్ ఎలా చెలరేగుతారో గత మ్యాచ్‌ల్లో చూశాం. అయితే, రాజస్థాన్ బౌలింగ్ పరంగా కాస్త మెరుగువ్వాల్సి ఉంది. బౌల్ట్, హోల్డర్, చాహల్, అశ్విన్‌లతో బౌలింగ్ పరంగానే రాజస్థాన్ బలంగానే ఉన్నది.