- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నై సూపర్ విక్టరీ.. లక్నో మెరుపు ఇన్నింగ్స్ వృధా..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో 6వ మ్యాచ్ చెన్నై, లక్నో జట్ల మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో CSK 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు గయక్వాడ్, కాన్వే మెరుపు ఇన్నింగ్స్, చివర్లో రాయుడు, ధోని భారీ షాట్ కారణంగా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 217 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు కేవలం పవర్‌ప్లే లోనే 80 పరుగులు చేసి.. విజయం వైపు దూసుకెళ్లింది. కానీ ఆల్ రౌండర్ మోయిన్ అలీ, స్పినర్ శాంట్నర్, లక్నో పరుగుల వరదకు అడ్డుకట్ట వేశారు. చివర్లో పూరన్ మ్యాచ్ విన్నింగ్‌కి ఎంతో ప్రయత్నం చేసి అవుట్ అయ్యారు. దీంతో లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. దీంతో చెన్నై జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సీజన్‌లో మొదటి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.