- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
GT Vs DC: మరోసారి చితక్కొట్టిన రిషభ్ పంత్ .. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ జట్టు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్లు పృథీ షా, మెక్‌గర్క్ చక్కటి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. పృథ్వీ షా 7 బంతుల్లో 11 పరుగులు చేసి వారియర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అదేవిధంగా మంచి ఊపులో ఉన్న మెక్‌గర్క్ 14 బంతుల్లో 23 పరుగు చేసి అదే వారియర్ బౌలింగ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అనంతరం అనూహ్యంగా బ్యాటింగ్‌కు వచ్చిన స్పిన్నర్ అక్షర్ పటేల్ గుజరాత్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కేవలం 43 బంతుల్లోనే 66 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించేందుకు బాటలు వేశాడు. మరో బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ కేవలం 5 పరుగు చేసి నిరాశ పరిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క కెప్టెన్ రిషభ్ పంత్ కేవలం 43 బంతుల్లోనే 88 పరుగులతో విరవిహారం చేశాడు. ఏకంగా 8 సిక్స్‌లు, 5 ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివరల్లో వచ్చిన స్టబ్స్ 7 బంతుల్లోనే 26 పరుగులు రాబట్టాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది.
గుజారాత్ బౌలర్లలో అజ్మతుల్లా, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. 225 పరుగు విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ వికెట్ కోల్పోయింది. గిల్ 5 బంతుల్లో 6 పరుగులు చేసి నోర్ట్జీ బౌలింగ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 15 బంతుల్లో 33 పరుగులు చేసి ధాటిగా ఆడుతున్నాడు. అతడితో పాటు సాయి సుదర్శన్ 16 బంతుల్లో 27 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 83 బంతుల్లో 157 పరుగులు చేయాల్సి ఉంది.