- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్లే ఆఫ్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అవుట్..!
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై వేదికగా జరిగిన ఢిల్లీ, చెన్నై మ్యాచులో DC 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తప్పుకున్నట్లు కనిపిస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 11 మ్యాచులు ఆడిన వార్నర్ సేన.. నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి 8 పాయింట్లతో టేబుల్ చివరి స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీకి ఇంకా 3 మ్యాచులు మిగిలి ఉన్నప్పటికి.. ఢిల్లీ జట్టు ముందుగానే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తుంది.
ఎందుకంటే టేబుల్ టాప్ పొజిషన్‌లో ఉన్న జట్లు అన్ని కూడా దాదాపు ఏడు నుంచి 8 మ్యాచులు గెలిస్తేనే టాప్ ఫోర్ లో ఉండే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీ జట్టు మిగిలిన మూడు మ్యాచుల్లో విజయం సాధించిన కూడా ప్లే ఆప్ చేరుకోవాలంటే ప్రస్తుతం టాప్‌లో ఉన్న నాలుగు జట్లు.. తదుపరి అన్ని మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇది ఎలాగో సాధ్యం కాని విషయం అవ్వడంతో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ ఆశలను పూర్తిగా వదులుకున్నట్టు కనిపిస్తుంది.