రిషభ్ పంత్ కు అరుదైన గౌరవం.. డగౌట్ లో అతని జర్సీ

by Shiva |
రిషభ్ పంత్ కు అరుదైన గౌరవం.. డగౌట్ లో అతని జర్సీ
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల కారు యాక్సిడెంట్‌లో గాయపడిన రిషభ్ పంత్ ఐపీఎల్ 2023కి పూర్తిగా దూరమయ్యాడు. దీంతో ఢిల్లీ జట్టు గొప్ప సమయస్ఫూర్తి, ప్రేమను ప్రదర్శించింది. శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో రిషబ్ పంత్ జెర్సీని జట్టు మేనేజ్‌మెంట్ వేలాడదీసింది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ ప్లేయర్ జెర్సీలో డగౌట్‌ ప్రదర్శించడం తొలిసారి కావడం విశేషం.

రిషభ్ గైర్హాజరుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ ముందుండి నడిపిస్తున్నాడు. అయితే, రిషభ్ టోర్నీలో ఆడలేకపోయినా ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో పంత్ ఉంటే చాలని మొదటి నుంచి ఆ టీమ్‌ మేనేజ్‌మెంట్ చెప్తోంది. కానీ సర్జరీల నుంచి కోలుకుంటున్న పంత్ ఇంటి దగ్గర నుంచే మ్యాచ్‌లను వీక్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడని గుర్తు చేసుకుంటూ స్టేడియంలోని ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో జెర్సీని వేలాడదీశారు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఏడు మ్యాచ్‌ ఆడనుంది. వాటిని వీక్షించేందుకు రిషబ్ పంత్ స్టేడియానికి వచ్చే అవకాశం ఆన్నందున ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నేరుగా ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌కి రిషబ్ పంత్ చేరుకునేలా స్పెషల్ ర్యాంప్‌ని ఏర్పాటు చేస్తామని డీడీసీఏ ఇప్పటికే ప్రకటించడం విశేషం.

Advertisement

Next Story