- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Champions Trophy : భారత ప్లేయర్లు వైట్ జాకెట్స్‌ను ఎందుకు ధరించారు?.. దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసా?

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొట్టింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంది. అయితే, చాంపియన్స్ ట్రోఫీ అందుకునే సమయంలో భారత ఆటగాళ్లందరూ వైట్ జాకెట్స్ ధరించారు. ట్రోఫీని అందుకునే ముందు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ భారత ప్లేయర్లకు వైట్ జాకెట్స్ అందుకున్నారు. ఈ సారే కాదు ప్రతి చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టు ఈ జాకెట్స్‌ను ధరిస్తూ వస్తోంది. ఈ వైట్ జాకెట్స్ వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. 2009లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఈవెంట్ నుంచి ఈ వైట్ జాకెట్స్ సంప్రదాయం మొదలైంది. అప్పటి నుంచి ప్రతి ఎడిషన్‌లో ఐసీసీ ఇలాగే విజేతలకు జాకెట్లను అందిస్తుంది. వైట్ సూట్ అనేది చాంపియన్లను అలంకరించే గౌరవం చిహ్నంగా పేర్కొంటారు. చాంపియన్స్ ట్రోఫీలో ఆటగాళ్లకు ఈ తెల్లని సూట్స్‌ను అందించడం వెనుక ఐసీసీ ఆశయం కూడా ఉంది. ఆటగాళ్ల గొప్పతనం, దృఢ సంకల్పానికి వైట్ సూట్స్ ప్రతీక అని ఐసీసీ గతంలో తెలిపింది. ఈ ట్రోఫీ కోసం ఆటగాళ్లు చేసిన అవిశ్రాంత కృషిని, తరతరాలకు స్ఫూర్తినిచ్చే అంశంగా ఈ వైట్ సూట్స్ ప్రతిబింబిస్తాయని ఐసీసీ తెలిపింది.