జయహో భారత్.. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై సూపర్ విక్టరీ

by Harish |
జయహో భారత్.. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై సూపర్ విక్టరీ
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా టీమ్ ఇండియా నిలిచింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(76) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. అక్షర్ పటేల్(47) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దూబె(27) రాణించాడు. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులే చేసింది. క్లాసెన్(52) మెరుపు హాఫ్ సెంచరీతో టెన్షన్ పెట్టినా భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో జట్టును గెలిపించారు. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అర్ష్‌దీప్ సింగ్ ,బుమ్రా చెరో 2 వికెట్లతో సత్తాచాటారు.

Advertisement

Next Story