BREAKING : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత్

by Sathputhe Rajesh |
BREAKING : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ-20 వరల్డ్ కప్ ఫైనల్‌లోకి టీమిండియా దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో భారత్ ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా భారత బ్యాటర్లు ధాటిగా ఆడి 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 171 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లాండ్ జట్టు ముందు ఉంచారు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లోను అదరగొట్టాడు. 39 బంతుల్లో 57 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అనంతరం 172 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 16.4 ఓవర్లకే ఇంగ్లాండ్ 103 పరుగులకు ఆలౌట్ అయింది. తొలుత బట్లర్ దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్ జట్టు 3 ఓవర్లలోనే 26/0గా నిలిచింది. అయితే తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ జట్టు పేకమేడలా కూలిపోయింది. కుల్ దీప్ యాదవ్ (3/19) అక్షర్ పటేల్ (3/23) ఇంగ్లాండ్ జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. ఇక, భారత్ సౌతాఫ్రికాతో రేపు (శనివారం) ఫైనల్‌లో తలపడనుంది.

Advertisement

Next Story