- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
దిశ, మెదక్ ప్రతినిధి : ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు మెదక్ పట్టణం వెంకటేశ్వర కాలనీకి చెందిన రిటైర్డు లెక్చరర్ సంగమేశ్వర్ కుమారుడు జట్కా సందీప్ (35) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు నర్సాపూర్ లో ఉండడం వల్ల సందీప్ ఒంటరిగానే ఉంటుంటున్నాడు. మూడు రోజులుగా ఫోన్ చేసిన సమాధానం ఇవ్వకపోవడంతో విషయం పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా ఇంట్లో సందీప్ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.
మృతి చెందిన రెండు మూడు రోజులు కావడం వల్ల శవం కుళ్లినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు చిన్నప్పటి నుంచే అన్ని వివాదాలకు నెలవయ్యాడు. గతంలో పోలీస్ లు రౌడీ షీట్ నమోదు చేశారు. ఇటీవలే బాలింత, పనిపిల్ల పై కిరోసిన్ పోసేందుకు యత్నించి జైలు కు వెళ్లి వచ్చాడు. సందీప్ పై పలు కేసులు సైతం ఉండేవి. ఆత్మహత్య కు కారాణాలు తెలియలేదు. కుటుంబీకులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పట్టణ సీ ఐ నాగరాజు తెలిపారు.
- Tags
- suicide