- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
పాముకాటుకు గురై మహిళ మృతి

దిశ మక్తల్ : పొలంలో కలుపు తీయడానికి వెళ్లిన మహిళ సువర్ణ ( 42) పాముకాటు గురై మృతి చెందిన సంఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగంబండ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మహిళకు డాక్టర్ రెండు ఇంజక్షన్ వేశారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
సంగంబండ గ్రామానికి చెందిన మహిళా పొలంలో కలుపు తీయడానికి వెళ్లగా చేతిపై ఏదో కాటు వేసినట్టుగా అనిపించి, ఏంటా అని వెతికే క్రమంలో మరో సారి కాటు వేసింది. దీంతో హుటాహుటిన మక్తల్ సివిల్ ఆస్పత్రికి తీసుకపోగ, ఏదో మొక్కుబడిగా రెండు ఇంజక్షన్స్ వేసి త్వరగా జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు చెప్పడంతో, అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా మార్గమద్య లో చనిపోయింది. మక్తల్ సివిల్ ఆస్పత్రిలో పాము కాటు మందులు లేకపోవడం, డాక్టర్లు సరిగా స్పందించకపోవడంతో, సువర్ణ చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు.