ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

by Sridhar Babu |
ఆర్థిక ఇబ్బందులతో  మహిళ ఆత్మహత్య
X

దిశ,ఉప్పల్ : అప్పులు చేసి సకాలంలో తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో మహిళ సూసైడ్ చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రామంతపూర్ వెంకటరెడ్డి నగర్ వీధి నెంబర్ 11 లో షేక్ అమీర్ భాష, షేక్ షాహిన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.షేక్ షాహీన్ సంవత్సరం క్రితం నుంచి సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ లోని ఎస్ఐఎస్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు వెళ్లి సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వస్తుంది.

ఎప్పటిలాగే బుధవారం ఉదయం షేక్ షాహిన్ డ్యూటీకి వెళ్లింది. ఆమె భర్త కూడా డ్యూటీకి వెళ్లిపోయాడు. అదే రోజు సాయంత్రం తన కుమారుడు షేక్ షకీరా పాషా స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపులకు లోపల నుండి తాళం వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా తన తల్లి సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించాడు. ఆ విషయాన్ని తన తండ్రికి, అదే బిల్డింగ్ లో ఉంటున్న బంధువులకు తెలియజేశాడు. దాంతో వారు వచ్చి ఆమెను చికిత్స కోసం రామంతాపూర్ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. డ్యూటీ డాక్టర్ ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చేసిన అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుందని, మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అడ్మిన్ కోటేశ్వరరావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed