- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇద్దరు పోలీసుల కాల్చివేత: అమెరికాలో దారుణం
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిన్నెసోటా రాష్ట్రంలో ఇద్దరు పోలీసులు, మరో వ్యక్తిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఆదివారం ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. మిన్నియాపాలిస్ శివారులో ఓ ఇంట్లో గొడవ జరుగుతుందని, అంతేగాక ఓ వ్యక్తి ఆయుధాలు కలిగి ఉన్నాడని, ఆ ఇంటిలో ఉన్న పిల్లలు ప్రమాదంలో ఉన్నారని వార్నింగ్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం ఇంటి బయట నుంచి వారితో మాట్లాడుతుండగానే నిందితుడు లోపల నుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పోలీసులు, కాల్పులు జరిపిన వ్యక్తి సైతం మృతి చెందారు. అయితే షూటింగ్ చేసిన దుండగుడు ఎలా మరణించారనే వివరాలు అధికారులు వెల్లడించలేదు. కుటుంబంలోని 2 నుంచి 15ఏళ్ల వయసున్న ఏడుగురు పిల్లలు సేఫ్‌గా ఉన్నట్టు తెలిపారు. ఘటనా స్థలంలో అనేక తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అవి అత్యంత శక్తి వంతమైనవని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్టు మిన్నెసోటా బ్యూరో ఆఫ్ క్రిమినల్ అప్రెహెన్షన్ సూపరింటెండెంట్ డ్రూ ఎవాన్స్ చెప్పారు. ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ బర్న్స్ స్పందించారు. ఇది చాలా హృదయ విదారక ఘటన అని తెలిపారు. ఓ కుటుంబాన్ని రక్షించడానికి పోలీసులు ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. కాగా, మిస్సౌరీలో గత బుధవారం కాన్సాస్ సిటీ చీఫ్స్ సూపర్ బౌల్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా కాల్పులు జరపడంతో ఒకరు మరణించగా.. 21 మంది గాయపడ్డారు.