- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tractor Driver died : లక్డారంలో విషాదం.. క్వారీ గుంతలో ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ గల్లంతు
దిశ, పటాన్ చెరు : పటాన్ చెరు మండలం లక్డారంలో విషాదం చోటు చేసుకుంది. క్వారీ గుంతలో ట్రాక్టర్ తో పాటు డ్రైవర్ పడిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం లక్డారం గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల నర్సింలు ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం రాయి నింపడానికి ట్రాక్టర్ తో పాటు వెళ్లి ట్రాలీ లో కొంత రాయి లోడ్ వేసి ముందుకు తీస్తుండగా ప్రమాదవశాత్తు
ఇరవై అడుగుల పై నుంచి ట్రాక్టర్ క్వారీ గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ తో పాటు డ్రైవర్ గల్లంతయ్యారు. ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగి గంటల సమయం గడుస్తున్నా గాలింపు చర్యలు చేపట్టకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వారీలో సంవత్సరం నుండి పనులు నిలిచిపోయినా ఇప్పటి వరకు గుంతను పూడ్చకపోవడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వంతోపాటు వారి యజమాని బాధ్యత వహించి సదరు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది ప్రభుత్వ హత్య : పటాన్ చెరు బీజేపీ మండల అధ్యక్షుడు వీరేశం
లక్డారంలోని సత్యపాల్ రెడ్డి క్వారీలో జరిగిన ప్రమాదం ప్రభుత్వ తప్పిదమేనని పటాన్చెరు బీజేపీ మండల అధ్యక్షుడు కావలి వీరేశం ఆరోపించారు. ఈ ప్రమాదాన్ని ప్రభుత్వ హత్యగా అభివర్ణించారు. కాల పరిమితి ముగిసిన క్వారీ గుంతలు ఏమీ లేవని అధికారులు నివేదికలు ఇచ్చారని మరి గుంతలేవి లేనప్పుడు ఈ ప్రమాదానికి కారణం ఏంటని ఆయన అధికారులని నిలదీశారు. వారి చుట్టూ కనీస భద్రత ఏర్పాట్లు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వాపోయారు. వెంటనే క్వారీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం స్పందించి గాలింపు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
- Tags
- crime