మహిళపై హత్యాయత్నం.. అక్రమ సంబంధమే ఈ ఘటనకు కారణం

by Aamani |
మహిళపై హత్యాయత్నం.. అక్రమ సంబంధమే ఈ ఘటనకు కారణం
X

దిశ,ఉప్పల్ : ఒక మహిళపై ఒక వ్యక్తి హత్య యత్నానికి పాల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్ లో నివాసం ఉంటున్న మహిళ ఆటో డ్రైవర్ మల్లేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. గత కొంతకాలంగా ఆ వ్యక్తిని దూరం పెట్టి వేరే వ్యక్తితో మాట్లాడుతుందని అనుమానంతో శనివారం మధ్యాహ్నం మల్లేష్ మద్యం సేవించి ఆమె ఇంటికి వెళ్లి బ్లెడ్ తో తలపై దాడి చేయడంతో రక్త గాయాలతో కింద పడిపోయింది. వెంటనే చికిత్స నిమిత్తం కోసం అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహిళకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మల్లేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story