- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడి మత్తులోపడి కన్న కొడుకును హత్య చేసిన కామాంధురాలు
దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి/బిజినపల్లి : తన శారీరక సుఖం, అక్రమ సంబంధానికి తరచూ అడ్డుపడుతున్నాడన్న అక్కస్సుతో కన్న కొడుకునే కర్కశంగా హత్య చేసింది ఓ కసాయి తల్లి. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవి, లక్ష్మి దంపతులు. వీరికి కుమారుడు హరీష్(11) ఉన్నాడు. కాగా, లక్ష్మి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. తరచూ రాత్రి సమయంలో ఇంటికి వచ్చి వెళుతున్న ఆ వ్యక్తిని తన కుమారుడు చూడడంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుంది.
ఈ క్రమంలో గురువారం ఇంట్లో భర్త లేని సమయంలో కుమారుడిని రోకలిబండతో కొట్టి బట్టలో చుట్టి నీటి తొట్టిలో పడేసి నీటిలో మునిగి చనిపోయాడంటూ స్థానికులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ తలకు బలమైన గాయం కారణంగా రక్తస్రావం కావడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త సైతం అదే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్య లక్ష్మిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.