Accident : బీభత్సం సృష్టించిన కారు… ఒకరు మృతి

by Kalyani |
Accident : బీభత్సం సృష్టించిన కారు… ఒకరు మృతి
X

దిశ, ఆలూర్ : ఆర్మూర్ ధోబి గాడ్ దగ్గర శుక్రవారం రోజు ఒక కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో నిర్మల్ జిల్లా ఖనాపురం మండలం చింతల్ చింత గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి నాగేష్ చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్మూర్ పోలీసులు తెలియజేశారు.



Next Story