డాక్టర్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్..

by Aamani |
డాక్టర్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్..
X

దిశ, పెద్దపల్లి : డాక్టర్ పై దాడి చేసిన నిందితుడిని పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో పెద్దపల్లి కాలేజ్ గ్రౌండ్ ముందు గల శ్రీ సిద్ధార్థ హాస్పిటల్ డాక్టర్ కొక్కుల రాజేష్ ను పెద్దపల్లి,చింతల వాడకు చెందిన ఎండి ఖదీర్ హుస్సేన్ చంపే ఉద్దేశంతో కత్తితో దాడి చేశారు.నిందితుడు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తాడు. తన చిన్న కూతురైన (7) నేలల వయస్సు గల అబిహ,నంజు తో అనారోగ్యానికి గురై ఈ నెల 8 న సిద్ధార్థ ఆసుపత్రిలో చేరి 10న డిశ్చార్జ్ అయ్యారు ఈ నెల 12 గురువారం ఉదయం ఆసుపత్రికి ఇంజెక్షన్ కోసం రాగా డాక్టర్,నర్సులు ఇద్దరు అబీహా కు వైద్యం అందించారు.

పరిస్థితి విషమించగా,మెరుగైన వైద్యం కోసం డాక్టర్ సూచన మేరకు కరీంనగర్ లోని స్పర్శ ఆసుపత్రికి తరలించగా మధ్యాహ్నం 3.30 గంటలకు అదే ఆసుపత్రిలో అభిహ మృతి చెందింది.డాక్టర్,నర్స్ ఇద్దరు నిర్లక్షంగా వైద్యం అందించడం వలనే తన కూతురు చనిపోయిందని కోపంతో డాక్టర్ ని చంపాలనే ఉద్దేశ్యంతో ఖదీర్,కత్తి తీసుకుని డాక్టర్ పై దాడి చేసి గాయపరిచారు.నేరస్థుని వద్ద నుండి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకోనైనదని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed