- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రిటైర్డ్ జావాన్ సతీమణి అనుమానాస్పద మృతి
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : డిచ్ పల్లి మండల కేంద్రం సాయినగర్ లో రాథోడ్ విజయ (30) అనే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డిచ్ పల్లిలోని సాయినగర్ కు చెందిన రిటైర్డ్ జవాన్ గబ్బర్ సింగ్ భార్య రాథోడ్ విజయ ఇంట్లో ఉరేసుకుంది. ఇది గమనించిన మృతురాలి భర్త గబ్బర్ సింగ్ వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎండీ. షరీఫ్ తెలిపారు. గబ్బర్ సింగ్ కు విజయ రెండో భార్య అని తెలిసింది. కాగా ఈమె మృతిపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
- Tags
- Suspicious death
Next Story