- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జల్సాల కోసం దొంగతనాలు
దిశ, తాండూరు : జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను కరన్ కోట్ పోలీసులు పట్టుకున్నారు. కరన్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామ పరిధిలో నాపరాతి గనులలో కేబుల్ వైర్లు, సింగిల్ ఫేస్ మోటార్లు దొంగతనానికి గురైనట్లు కరణ్ కోట్ గ్రామానికి చెందిన తుపాకుల బసప్ప పోలీస్ లకు ఫిర్యాదు చేయగా, అదే గ్రామానికి చెందిన మేస్త్రి దుర్గప్ప తనకు చెందిన నాపరాతి గనిలో సింగిల్ ఫేస్ మోటార్లు చోరీ అయినట్టు ఫిర్యాదు చేశాడు. దీంతో సీరియస్ గా తీసుకున్న ఎస్సై విఠల్ రెడ్డి దొంగతనానికి సంబంధించిన అంశంపై వేరు వేరు కేసులు నమోదు చేసుకున్న కరణ్ కోట్ పోలీస్ లు విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా అనుమానితులుగా కనిపించిన మల్కాపూర్ గ్రామానికి చెందిన జగ్గప్ప, రాములు అనే వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు విచారించగా కరణ్ కోట్ గ్రామ శివారులోని నాపరాతి గనులలో జరిగిన రెండు దొంగతనాలు కూడా తామే చేశామని ఒప్పుకున్నారు. ఆ వ్యక్తుల నుండి కేబుల్ వైరు స్వాధీనం చేసుకోగా, మరో ఫిర్యాదు దారుడు ఇచ్చిన సింగిల్ ఫేస్ మోటార్‌ను కర్ణాటక రాష్ట్రంలోని గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయించినట్టు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాండూర్ మున్సిఫ్ కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి ఇరువురిని రిమాండ్ కు తరలించేందుకు ఆదేశాలు చేరీ చేసినట్టు ఎస్సై వివరించారు.
- Tags
- Steals