మెట్రో స్టేషన్‌‌లో సెక్యూరిటీ గార్డు హస్త ప్రయోగం.. వీడియో తీసిన మహిళ

by Nagaya |
మెట్రో స్టేషన్‌‌లో సెక్యూరిటీ గార్డు హస్త ప్రయోగం.. వీడియో తీసిన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్ : సురక్షిత ప్రయాణమని మెట్రో రైలు ఎక్కడానికి వచ్చిన మహిళకు సెక్యూరిటీ గార్డు షాకిచ్చాడు. టికెట్ తీసుకుని ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న ఆమెను తదేకంగా చూస్తూ ఓ సెక్యూరిటీ అసభ్యంగా ప్రవర్తించాడు. ప్లాట్ ఫామ్‌పై ఆమెకు ఎదరుగా నిలబడి బహిరంగంగా హస్తప్రయోగం చేశాడు. అంతేకాక ప్రైవేట్ పార్ట్‌ను చూపిస్తూ అసభ్య సంజ్ఞలు చేశాడు. ఈ తతంగం మొత్తం వీడియో తీసిన మహిళ మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరు మెట్రోలో వెలుగుచూసింది ఈ దారుణ ఘటన.

జాలహళ్లి మెట్రో స్టేషన్‌లోనే మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బహిరంగంగా హస్తప్రయోగం జరిగిందని సదరు మహిళ మెట్రో అధికారులకు వీడియోలతో సహ చూపించి ఫిర్యాదు చేసింది. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అనుచితంగా తాకాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. సెక్యూరిటీ గార్డు హస్త ప్రయోగం వీడియోను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మెట్రో అధికారులపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మహిళా ప్రయాణికులకు భద్రత కల్పించాలని, ఇలాంటి సిగ్గుమాలిన పనులు పునరావృత్తం కాకుండా చూడాలని నెటిజన్స్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed