14 ఏళ్ల బాలికపై అత్యాచారం: తల్లి లివ్ ఇన్ పార్ట్‌నరే నిందితుడు

by samatah |
14 ఏళ్ల బాలికపై అత్యాచారం: తల్లి లివ్ ఇన్ పార్ట్‌నరే నిందితుడు
X

దిశ. నేషనల్ బ్యూరో: ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే బాలిక తల్లి లివ్ ఇన్ పార్ట్‌నరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో నివసించే మహిళకు ముగ్గురు పిల్లలు. ఎనిమిదేళ్ల క్రితం తన భర్తను విడిచిపెట్టింది. అప్పటి నుంచి ఘజియాబాద్‌కు చెందిన బస్సు డ్రైవర్ అంకిత్ యాదవ్‌తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల మహిళ తన పిల్లలను ఇంటి వద్ద వదిలి బయటకు వెళ్లగా.. పిల్లలను బెదిరించిన అంకిత్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో జరిగిన విషయం తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, 506, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్టు చేశారు. అంతకుముందు కూడా నిందితుడు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story