క్రెడిట్ కార్డుపై అప్పులు.. సిబ్బంది వేధింపులకు ఎంబీఏ విద్యార్థి..

by Disha Web Desk 4 |
క్రెడిట్ కార్డుపై అప్పులు.. సిబ్బంది వేధింపులకు ఎంబీఏ విద్యార్థి..
X

దిశ, వరంగల్ : క్రెడిట్ కార్డు, లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకున్న యువకుడు సంస్థ వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కరీమాబాద్ జన్మభూమి జంక్షన్ ప్రాంతానికి చెందిన కమ్మంపాటి విష్ణువర్ధన్ (23) బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కరీమాబాద్ జన్మభూమి జంక్షన్ ప్రాంతానికి చెందిన కమ్మంపాటి యాకయ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో రెండో కుమారుడైన విష్ణువర్ధన్ ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

అయితే కొద్ది రోజుల క్రితం ఆన్‌లైన్‌లో కొన్ని యాప్, క్రెడిట్ కార్డ్స్ నుండి లోన్లు తీసుకొని అవి కట్టేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడేవాడు. క్రెడిట్ కార్డ్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వారు అప్పు చెల్లించాలని వేధింపులకు గురి చేశారు. దీంతో అప్పుల బాధలు తట్టుకోలేక ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రపోతుండగా అర్ధరాత్రి సుమారు రెండు మూడు గంటల సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఉదయం 6 గంటలకు చూసి అరవడంతో గమనించిన స్థానికులు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు తెలిపారు.

Next Story

Most Viewed