- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్యాంకులో రూ.2.8 కోట్లు కాజేసిన మేనేజర్.. భార్య అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్

దిశ, వెబ్‌డెస్క్: దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు, రికార్డులు సరిచేయాల్సిన రెవెన్యూ అధికారులు తరచూ మోసాలకు పాల్పడటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా.. ఇదే తరహాలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా మేనేజరే బ్యాంకులో డబ్బులు కాజేశాడు. ఈ ఘటన నగరంలోని రామంతాపూర్ ఎస్‌బీఐ(SBI) బ్యాంకులో చోటుచేసుకుంది. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.2.8 కోట్లు కాజేశాడు. ఖాతాదారుల డాక్యుమెంట్లతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
మేనేజర్ భార్య, కొడుకు ఖాతాలకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. మొత్తం 19 మంది డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకొని వారి పేర లోన్లు తీసుకున్నాడు. మోసం జరిగిందని గుర్తించిన ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో మేనేజర్లు సైదులు, గంగమల్లయ్యపై కేసు నమోదైంది. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.