- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో భారీ పేలుడు.. ఒకరు స్పాట్ డెడ్.. మరికొందరికి తీవ్ర గాయాలు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో భారీ పేలుడు సంభవించింది. బుధవారం ఉదయం వసంత కెమికల్స్ కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలి పేలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. రియాక్టర్ పేలుడుతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు ఫ్యాక్టరీ నుండి బయటకు పరుగులు తీశారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. రియాక్టర్ పేలడానికి ఓవర్ హీటే కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి రియాక్టర్ బ్లాస్టింగ్‌పై ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.