- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాదాపూర్‌లో ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు విద్యార్థుల అరెస్ట్
దిశ, శేరిలింగంపల్లి : డ్రగ్స్ సప్లై దారులపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న రవాణా దారులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా మాదాపూర్ లో డ్రగ్స్ సప్లై చేసేందుకు యత్నిస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను గురువారం డీటీఎఫ్ టీం అరెస్ట్ చేసింది. మాదాపూర్ లో ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు 30 ఎల్ ఎస్ డీ డ్రగ్స్ స్ట్రిప్ లను అమ్మకాలకు ప్రయత్నిస్తుండగా ఎక్సైజ్ డిటిఎఫ్ టీం అదుపులోకి తీసుకుంది.
వారి వద్ద నుంచి రూ. 70 వేల విలువచేసే డ్రగ్స్ తో పాటు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఇంజనీరింగ్ చదువుతున్న చెన్నైకి చెందిన చరణ్ తేజ్ తో పాటు కౌశిక్, సయ్యద్ లను అరెస్ట్ చేశారు. వీరు చెన్నై నుంచి డ్రగ్స్ ను నగరానికి తీసుకువచ్చి విద్యార్థులకు సరఫరా చేస్తునట్లు డీటీఎఫ్ అధికారులు తెలిపారు. మరో సరఫరాదారు సరఫరాజ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.