- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేనల్లుడు లేచిపోతే...మామకు టార్చర్
దిశ, చార్మినార్ : మీ అల్లుడు మరో యువతిని తీసుకెళ్లాడని, వారి జాడ చెప్పాలని రెయిన్ బజార్ పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ వృద్ధుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం తీవ్ర కలకలం రేపింది. ‘నిన్న రాత్రి నా కూతురుకు ఫోన్ చేసి తీసుకుపోతాం అని రెయిన్ బజార్ పోలీసులు బెదిరించారు. ఇందులో మా తప్పేమీ లేదని, వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలియదని చెప్పినా నమ్మడం లేదు. మీరు పెట్టే టెన్షన్ మేము భరించలేక పోతున్నాం... టెన్షన్‌తో మేము ఎం చేస్తున్నామో మాకే అర్ధం కావడం లేదు.
నేను షాపుకు కూడా వెళ్లలేక పోతున్నాను...నా కూతురు, మా కుటుంబం మీద దయ చూపెట్టండి ...నేను సూసైడ్ చేసుకుంటున్నాను’ అంటూ తీసిన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. వివరాలలోకి వెళితే... పాతబస్తీ యాకుత్‌పురా ఎస్ఆర్టీ కాలనీకి చెందిన యూనుస్ ఖాన్ (75) సోదరి కుమారుడు నాలుగు నెలల క్రితం అల్లుడు ఒక యువతిని ప్రేమ పేరుతో తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించకపోవడంతో యువతి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు యూసుఫ్ ఖాన్ కుటుంబంపై రెయిన్ బజార్ పోలీసులు గత నెలరోజులుగా తీవ్ర ఒత్తిడి చేయసాగారు. శుక్రవారం రాత్రి కూడా మరో మారు రెయిన్ బజార్ పోలీసులు ఫోన్ చేసి వాళ్ల ఆచూకీ చెప్పక పోతే స్టేషన్‌కు తీసుకువెళ్తాం అని బెదిరించారు. దీంతో అప్పటికే టెన్షన్ లో ఉన్న యూనుస్ ఖాన్ శనివారం ఉదయం సెల్ఫీ వీడియో తీసి మరీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసును రెయిన్‌బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- suicide